పల్లకి వచ్చేందుకు చేపట్టిన రహదారి పనులు
1 min read
పల్లెవెలుగు వెబ్ రుద్రవరం: మండలంలోని తిమ్మనపల్లె నుండి నరసాపురం గ్రామానికి శ్రీ నరసింహ స్వామి ఉత్సవ పల్లకి వచ్చేందుకు రహదారి పనులు చేపట్టారు. పార్వేట ఉత్సవం లో భాగంగా తిమ్మనపల్లె గ్రామం నుండి సాంప్రదాయబద్ధంగా నరసాపురం చేరుకోవడానికి ఉత్సవ పల్లకి ఈ రహదారి వెంట రావడం జరుగుతుంది. రెండు గ్రామాల మధ్య సుమారు 5 కిలోమీటర్లు ఉన్న రహదారి వెంట ముళ్ళ పొదలు గుంతలు ఉండడంతో సర్పంచ్ గుర్రం శాంతకుమారి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి జయరామిరెడ్డి టిడిపి నాయకుడు పకీరయ్య జెసిబి డోజర్ సాయంతో ముళ్ళపొదలు తొలగించి గుంతలు చదును చేయించారు. మార్గమధ్యంలోని వాగుకు వంతెన నిర్మించి రహదారి శాశ్వత పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.