PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకం

1 min read

మాజీ యం.పి టి. జి. వెంకటేష్
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు : దేశరక్షణలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని మాజీ రాజ్యసభ సభ్యుడు టి. జి. వెంకటేష్ అన్నారు. విద్యార్థి దశ నుంచే దేశాన్ని కాపాడుకోవాలనే పట్టుదల అలవర్చుకోవడం వల్ల మనదేశం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మారుతుందని ఆయన అన్నారు. కర్నూలు నగర శివార్లలోని బి. తాండ్రపాడులో సైనిక్ స్కూల్ శిక్షణ కోసం ఏర్పాటు చేసిన జెనిత్ కోచింగ్ సెంటర్ ను ఆయన ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్బంగా టి. జి. వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులుగా ఉన్నపుడే జీవితంలో ఎత్తుపల్లాల గురించి తెలుసుకోవడానికి సైనిక్, మిలిటరీ స్కూళ్ళు దోహదపడతాయని అన్నారు. విద్యార్థులకు సైనిక్ స్కూల్ శిక్షణ ఇవ్వడానికి అన్ని సౌకర్యాలతో కోచింగ్ సెంటర్ ను ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు. సంస్థ చైర్మన్ ఎన్వీ ఖాన్ మాట్లాడుతూ తమ సంస్థలో సైనిక్ స్కూల్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్, నవోదయ, గురుకుల స్కూళ్లలో ప్రవేశాలకు బాల, బాలికలకు అత్యున్నత శిక్షణతో పాటు వేర్వేరుగా హాస్టల్ వసతి కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల్లో మానసిక దృఢత్వాన్ని పెంపొందించడానికి తమ కోచింగ్ సెంటర్ లోనే యోగా, మెడిటేషన్ శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సతీష్ కుమార్, బోధనా సిబ్బంది పాల్గొన్నారు.

About Author