పవన్ ఫ్యాన్స్ కి జగన్ మేలు చేస్తున్నారన్న రోజా.. ఎలా అంటే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి జగన్ మేలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆదివారం రోజా మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో సినిమా టికెట్ ధర రూ.350 ఉంటే..ఏపీలో రూ.150 ఉందన్నారు. పవన్ సినిమాను తొక్కితే ఆయనకు వచ్చే నష్టమేమి లేదన్నారు. జగన్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు మేలు చేస్తుందని చెప్పారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు తగదన్నారు. సినిమా టికెట్ల ధరపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందని ఎమ్మెల్యే రోజా తెలిపారు.