NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్.. తెర ముందు ఇనుప మేకులు !

1 min read

Representational image.

ప‌ల్లెవెలుగువెబ్ : విజయవాడలోని ఓ థియేట‌ర్ వినూత్న ఆలోచ‌న చేసింది. థియేట‌ర్ లోని తెర వ‌ద్ద అభిమానుల హడావుడిని అడ్డుకునేందుకు తెర ముందు ఇనుప మేకుల‌తో కూడిన చెక్క‌లు అమ‌ర్చింది. అన్నపూర్ణ థియేటర్‌లో ఇటీవల రాధేశ్యామ్‌ చిత్రం విడుదల రోజున అభిమానులు హీరో కనిపించగానే తెరపైనే పాలాభిషేకం చేశారు. దీంతో మరకలు పడి తెర పాడైంది. ఈ తెరను ఇటీవలే రూ.15 లక్షలు పెట్టి ఆధునీకరించారు. ఈ నెల 25న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా మేకులు కొట్టిన చెక్కలను తెర మందు ఉంచి ,అపాయం అని హెచ్చరిక బోర్టులు కూడా ఏర్పాటు చేసింది. అభిమానులు తెరవద్దకు వెళ్లకుండా ఆగడం లేదని అందుకే ఈ ఏర్పాట్లను యాజమాన్యం చెబుతోంది.

                                           

About Author