PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ. 10 కోట్లతో సమీకృత ఆర్ధిక భవనం..

1 min read

– ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన ఆర్ధిక శాఖామంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్..
– ఒకేచోటకి చేరిన ఆర్ధిక శాఖ కార్యాలయాలు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఆహ్లాదకర వాతావరణంలో చాలా అనుకూలమైన పనివాతావరణం కల్పిస్తూ సుమారు రూ. 10 కోట్లతో సమీకృత ఆర్ధిక భవనాన్ని అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన వ్యవహాల శాఖామంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ అన్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో సుమారు రూ. 10 కోట్లతో నిర్మించి అన్ని వసతులు కల్పించిన జిల్లా సమీకృత ఆర్ధిక భవనాన్ని గురువారం రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన వ్యవహాల శాఖామంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ , జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, ఆర్ధికశాఖ కార్యదర్శి డా. కెవి సత్యనారాయణ, ట్రెజరీ డైరెక్టర్ కెవి మోహన్ రావు, డైరెక్టర్ ఆఫ్ వర్క్ ఎకౌంట్స్ సిహెచ్ కె. మల్లేశ్వరరావు, ఎపిసిఎఫ్ ఎస్ ఎస్ సిఇఓ బి. సునీల్ కుమార్ రెడ్డి, ఎపిజిఎల్ఐ డైరెక్టర్ రెడ్డి శ్రీనివాసరావు, స్టేట్ ఆడిట్ డైరెక్టర్ హరిప్రకాష్, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, ఎపిఇడబ్ల్యూఐడిసి యండి సి. దీవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ భవనంలోని ఖజానా, ఎపిజిఎల్ఐ, స్టేట్ ఆడిట్, స్టేట్ ఆడిట్ రిలీఫ్ ఎకౌంట్స్, తదితర ఆర్ధిక విభాగాల కార్యాలయాలను పరిశీలించి ఉద్యోగులతో ముచ్చటించారు. అనంతరం రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ ఆర్కిటెక్ ప్రమాణాలతో వివిధ శాఖల భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కిటెక్చరల్ బోర్డు(ఎపిఎస్ఎబి) ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిద్వారా ఆయా ప్రభుత్వ భవనాలు వినియోగం, వాతావరణ పరిస్ధితులకు అనుగుణంగా ఒక నిర్మాణాత్మక పద్దతిప్రకారం డిజైన్ రూపొందించి నిర్మించడం జరుగుతుందన్నారు. గత కట్టడాలకు ప్రస్తుత కట్టడాలకు ఎంతో వ్యత్యాసం కనబడుతుందన్నారు. ఎసిల పై పూర్తిగా ఆధారపడకుండా తాజా గాలి, వెలుతురు వచ్చేలా భవన నిర్మాణాలు ఉంటాయన్నారు. దేశంలో మన రాష్ట్రంలోనే ఈ పద్దతిపై ప్రత్యేత దృష్టి పెట్టడం జరిగిందన్నారు. గతంలో ఇంత సూక్ష్మంగా ఆలోచించే పరిస్ధితి లేదన్నారు. ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని ఆర్కిటెట్ విభాగ పరిశోధన ప్రమాణాల మేరకు భవనాలతో పాటు అందులోని మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులు ఉత్తమసేవలు అందించేందుకు వీలుగా కూర్చునే కూర్చీల నుంచి ప్రతిఒక్క పర్నిఛర్ ను నాణ్యతా ప్రమాణాల మేరకే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో భవనాలు నిర్మించడమే కాకుండా గత ప్రభుత్వం చేపట్టి అసంపూర్తిగా మిగిల్చిన భవనాలను పూర్తిచేయడం జరుగుతున్నదన్నారు. అందులోనే ఏలూరులోని సమీకృత ఆర్ధికశాఖ భవన సముదాయమని ఆయన తెలుపుతూ సుమారు 26 వేల 500 చ.అ. గల విస్తీర్ణంతో ఈ భవనంలో వివిధ ఆర్ధికశాఖలకు సంబంధించి విభాగాలు ఇక్కడినుంచే పనిచేయబోతున్నాయన్నారు. ఏలూరులో గతంలో ఖజానా, ఆడిట్, భీమా, ఇలా వివిధ విభాగాలు వేర్వేరు చోట్లనుంచి పనిచేసేవని ఇప్పుడు వాటన్నింటిని పైగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇటువంటి ముఖ్య విభాగాలు ఒకే భవనంలో సమీకృత ప్రాంగణంలో ఏర్పాటు అయ్యాయన్నారు. దీనివల్ల మరింత బాగా ఆయా విభాగాలు సేవలు అందించేందుకు వీలువుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్డిఓ కె. పెంచల కిషోర్, జిల్లా ఖాజానా అధికారి టి. కృష్ణ, ఎపిజిఎల్ఐ ఉప సంచాలకులు డి. అశోక్, రాష్ట్ర ఆడిట్ శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు బి. చిన్నప్పరెడ్డి, చెల్లింపులు, లెక్కల అధికారి ఎస్. నరేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమీషనరు శ్రీలక్ష్మి , ఎపిఇడబ్ల్యూఐడిసి కార్యనిర్వాహక ఇంజనీరు యం. సదాశివరావు, డిఆర్డిఏ పిడి ఆర్ విజయరాజు, సిపిఓ శ్రీనివాసరావు, ఎన్ జిఓ సంఘం జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, జేఎసి చైర్మన్ ఆర్ ఎస్ హరనాథ్, కప్పల సత్యనారాయణ, ఏలూరు తహశీల్దారు బి. సోమశేఖర్, పలువురు ఎన్ జిఓ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

About Author