రూ. 500 నోటు చెల్లదా ? .. ఆర్బీఐ క్లారిటీ
1 min readపల్లెవెలుగువెబ్ : 500 రూపాయల నోటుపై గాంధీ బొమ్మ, ఆకుపచ్చ గీతకు దగ్గరగా ఆర్బీఐ గవర్నర్ సంతకంపైన ఉన్న నోటు నకిలీది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై పీఐబీ క్లారిటీ ఇచ్చింది. నోటుపై ఉన్న గాంధీ బొమ్మ ఆకుపచ్చ గీతకు దగ్గరగా, దూరంగా ఉన్న రెండు నోట్లు సరైనవేనని తెలిపింది. “ఆర్బీఐ ప్రకారం రెండు రకాల నోట్లు చెల్లుబాటు అవుతాయి.” అని పేర్కొంది. ఈ క్రమంలోనే కొత్తగా విడుదలవుతున్న రూ. 500 నోట్లు ప్రస్తుతం రంగు, పరిమాణం, థీమ్, భద్రతా ఫీచర్ల స్థానం, డిజైన్ అంశాలలో పాత సిరీస్‌కు భిన్నంగా ఉన్నాయని స్పష‍్టం చేసింది. కొత్త నోటు పరిమాణం 66ఎంఎం x 150ఎంఎం ఉందని తెలిపింది. ఒక నోటు నకిలీదో కాదో నిర్ధారించుకోవడానికి, ఆర్‌బీఐ పాయింటర్లు, ప్రభుత్వ నిజ నిర్ధారణ సంస్థల్లో తెలుసుకోవాలని సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మవద్దని హితవు పలికింది.