NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎయిరిండియా ఎండీ నియామ‌కాన్ని అడ్డ‌కోవాలన్న ఆర్ఎస్ఎస్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ విమాన‌యాన సంస్థ ఎయిర్ ఇండియాకు కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఇల్కర్ ఐసీని నియమిస్తూ టాటా సన్స్ ఇటీవ‌ల నిర్ణ‌యం తీసుకుంది. 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు మీటింగ్‌లో కొత్త సీఈఓగా ఇల్కర్ ఐసీని నియమిస్తున్నట్లు టాటా గ్రూప్ వెల్లడించింది. టర్కీలో ఇల్క‌ర్ గ‌త రాజకీయ సంబంధాలను ఉటంకిస్తూ.. ఎయిర్ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫసర్‌గా ఇల్కర్ ఐసీ నియామకాన్ని అడ్డుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ 1994లో ఇస్తాంబుల్ మేయర్’గా పనిచేసినప్పుడు అతనికి సలహాదారుగా ఉన్న ఇల్కర్ ఐసీని తన బ్యాగ్ గ్రౌండ్ చెకింగ్ క్షుణ్ణంగా దర్యాప్తు చేయలని ఆర్ఎస్ఎస్ కేంద్రాన్ని కోరింది.

                                         

About Author