జీవితకాల కనిష్ఠం వద్ద రూపాయి విలువ !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశీయ కరెన్సీ విలువ సరికొత్త ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 11 పైసలు బలహీనపడింది. దాంతో ఎక్స్ఛేంజ్ రేటు చరిత్రలో తొలిసారిగా రూ.78 ఎగువకు చేరుకుంది. సోమవారం ఫారెక్స్ మార్కెట్లో 78.20 వద్ద ప్రారంభమైన డాలర్-రూపాయి మారకం రేటు.. ఒకదశలో 78.29కి చేరింది. చివరికి 78.04 వద్ద స్థిరపడింది. అంటే, ఒక డాలర్ కొనుగోలుకు ప్రస్తుత మారకం రేటు ప్రకారం రూ.78.04 వెచ్చించాల్సి ఉంటుంది. గత శుక్రవారం విడుదలైన డేటా ప్రకారం.. అమెరికాలో ధరలు 40 ఏళ్ల సరికొత్త గరిష్ఠ స్థాయి 8.6 శాతానికి ఎగబాకాయి.