NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హీరో సిద్ధార్థ్ పై సైనా నెహ్వాల్ తండ్రి కీల‌క వ్యాఖ్య‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ న‌టుడు సిద్ధార్థ్ .. బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ట్వీట్ పై ఇటీవ‌ల కామెంట్ చేశారు. పంజాబ్ లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌లో త‌లెత్తిన భ‌ద్ర‌తా లోపాల పై సైనా నెహ్వాల్ స్పందించింది. `ప్ర‌ధాని భ‌ద్ర‌త‌కే ముప్పు వాటిల్లిన‌ప్పుడు మ‌నం సేఫ్ గా ఉన్నామ‌ని ఎలా చెప్పుకోగ‌లం. ఆటంక‌వాదుల పిరికిపంద చ‌ర్య‌గా తీవ్రంగా ఖండిస్తున్నా “ అంటూ సైనా ట్వీట్ చేశారు. దీనికి కౌంట‌ర్ గా సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. చిన్న కాక్‌తో ఆడుతూ ప్రపంచాన్ని గెలిచినట్లు భావించే ఓ ఛాంపియన్‌ ఇండియాను రక్షించే వాళ్లు ఉన్నారులే అంటూ అభ్యంతరకర రీతిలో కామెంట్‌ చేశాడు. దీనిపై స్పందించిన సైనా తండ్రి హర్వీర్‌ సింగ్‌ నెహ్వాల్‌… ‘‘నా కూతురిని ఉద్దేశించి అతడు అలా వ్యాఖ్యానించడం నిజంగా బాధాకరం. అసలు అతడు దేశం కోసం ఏం చేశాడు? నా కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచింది.. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది’’ అని సిద్ధార్థ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

                                          

About Author