PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొత్తుల పై స‌జ్జ‌ల కీల‌క వ్యాఖ్య‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఏపీలో పొత్తుల పై ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్పందించారు. భావ సారూప్యత కలిగిన పార్టీల మధ్య పొత్తులుంటాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని జంప్‌లు చేశారో అందరికీ తెలుసునని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వ్యూహం అంటూ లేదని సజ్జల విమర్శించారు. చంద్రబాబు, పవన్‌కు మధ్య కచ్చితంగా అవగాహన ఉందన్నారు. చంద్రబాబు సీఎం పదవి త్యాగం చేసి పవన్‌కు ఇస్తారా? అని ప్రశ్నించారు. పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదన్నారు. బీజేపీతో పొత్తు ఉంటూనే.. పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలెదంటారని.. పవన్‌కు స్ర్కీన్‌ ప్లే, డైరెక్షన్ అన్నీ చంద్రబాబేనని ఆరోపించారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు.

                                               

About Author