రథోత్సవం సందర్భంగా గజ్జెహళ్లిలో ముమ్మరంగా శానిటేషన్ పనులు
1 min read
హొళగుంద, న్యూస్ నేడు : మండల పరిధిలోని గజ్జహళ్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అరుబట్ల నాగమ్మ అధ్యర్యంలో మురికి కాలువలు, చెత్తాచెదరం లేకుండా, జెసిబి సహాయంతో పలు ట్రాక్టర్ల ద్వారా మురికిని బయటకి తరలించి,డ్రైనేజీలన్ని శుభ్రం చేయటం జరిగిందని సర్పంచ్ తనయుడు గిరిమల్ల అన్నారు ఈ సందర్భంగా బుధవారం వారు మాట్లాడుతూ గ్రామంలోని వీధి వీధుల్లో సర్పంచ్ తనయుడు గిరిమల్ల, పంచాయతీ సెక్రటరీ ఏ,రంగస్వామి సందర్శించి,ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు వివిధ గ్రామాల ప్రజల ఆరాధ్య దైవమైన గజ్జహళ్ళి శ్రీ పోతులింగేశ్వర స్వామి రథోత్సవం శనివారం12,13,14న ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సందర్భంగా కొత్త వీధిలైట్లను అమర్చడం జరిగిందని, గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా గత మూడు రోజులుగా గజ్జెహళ్లి గ్రామంలో పారిశుద్ధ పనులు ఉమ్మరంగా జరుగుతున్నాయని, గ్రామంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ సర్పంచ్ తనయుడు గిరిమల్ల, రంగస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ సెక్రటరీ రంగస్వామి, సర్పంచ్ తనయుడు గిరిమల్ల, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పూజారి రామలింగ, స్కూల్ చైర్మన్ శేషప్ప, దాసరి రాము, డీలర్ పంపాపతి, హరిజన ఉమేష్ పూజారి,జనసేన తాయప్ప తదితరులు పాల్గొన్నారు.