50 డివిజన్ల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్ పనులు జరగాలి
1 min read
అకాల వర్షాల కారణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
సూపర్వైజర్స్,ఇన్స్పెక్టర్స్, మేస్త్రీలతో సమీక్ష సమావేశం
నగరపాల సంస్థ కమిషనర్ అన్నప్రగడ భానుప్రతాప్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో సచివాలయం సిబ్బంది మరియు సూపర్వైజర్స్ ఇన్స్పెక్టర్స్ మరియు పిహెచ్ మేస్త్రిలతో ఏలూరు నగరపాల సంస్థ మీటింగ్ హాల్ నందు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏలూరు పట్టణంలో 50 డివిజన్లలో పరిధిలో శానిటేషన్ అన్ని వీధులలో డ్రైన్స్ పూడికలు తీయటం గార్బేజ్ కలెక్టింగ్ సెంటర్స్ లో బ్లీచింగ్ చల్లట డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ పూర్తిగా అమలవునట్లుగా యుద్ధ ప్రాతిపదికన అమలయేటట్లు చూడాలన్నారు.ఉదయ నుంచి సాయంకాలం వరకు శానిటైరి సూపర్వైజర్లు అకాల వర్షాలు గాలి దుమారం వివిధ హోల్డింగ్స్ పడిపోవటం ఇలాంటి పరిస్థితులప్పుడు ఎప్పటికప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నగలపార సంస్థ కమిషనర్ అన్న ప్రగడ భాను ప్రతాప్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అదనపు కమిషనర్ చంద్రయ్య,డిప్యూటీ కమిషనర్ శివారెడ్డితో సమావేశం నిర్వహించడం జరిగినది. ప్రజలకు సేవ చేసేందుకు గాను నగరపాలక సంస్థ ద్వారా మనం జీతాలు తీసుకుంటున్నాము కనుక అకాల వర్షాల కారణంగా ప్రజలకు మరింత మెరుగైన సేవ చేసి సంస్థకి మంచి పేరు తెచ్చేట్లుగా కష్టపడి పని చేయాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో సచివాలయం శానిటేషన్ సిబ్బంది,శానిటరీ సూపర్వైజర్లు,శానిటరీ ఇన్స్పెక్టర్స్, మేస్త్రీ లు తదితరులు పాల్గొన్నారు.
