PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్రాంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయం

1 min read

– మాజీ రాజ్య సభ సభ్యులు టీజీ వెంకటేష్

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: నగరంలోని ఎన్ ఆర్ పేట లో ఉన్న భాష్యం ఉన్నత పాఠశాలలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల జడ్. ఈ.వో. అనిల్ కుమార్, భాష్యం లిటిల్ చాంప్స్ ప్రిన్సిపల్ అనురాధ తో పాటు పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని పాఠశాలల్లోని చిన్నారులు సాంప్రదాయ దుస్తుల్లో అందరినీ అలరించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సాంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులను అభినందించారు. అలాగే చిన్నారులపై భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి పర్వదిన పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రంగవల్లుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అలాగే సంక్రాంతి పండుగ శోభ ఉట్టిపడేలా పాఠశాల బోధన బోధ నేతర సిబ్బందితో కలిసి రాజ్యసభ మాజీ సభ్యులు భోగిమంటను వెలిగించి సంక్రాంతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేశారు. నిత్యం చదువులతో బిజీగా ఉండే భాష్యం పాఠశాలలో సంక్రాంతి వేడుకలు సందర్భంగా ప్రత్యేక సందడి నెలకొంది. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను గురించి విద్యార్థులకు తెలియజేసేలా పాఠశాల యాజమాన్యం వేడుకలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. సంక్రాంతి పండుగ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. సరిగ్గా ఇదే సమయంలో రైతులు పండించిన పంటల ధాన్యం ఇంటికి వస్తుందని, ఈ నేపథ్యంలో సంక్రాంతి పర్వదినాన్ని రైతులు అత్యంత ఘనంగా నిర్వహిస్తారని వివరించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి పండగ గొప్పతనాన్ని తెలియజేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author