ఇంటింటా భోగి మంటల నడుమా సంక్రాంతి
1 min read
ఇండ్ల ముందు రకరకాల ముగ్గులు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం మరియు గ్రామాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి వేడుకల్లో ప్రజలు సంతోషాల నడుమ భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇండ్ల ముందు రకరకాల ముగ్గులతో మహిళలు చిన్నారులు వేయడంతో కాలనీల్లో బుధవారం ఇండ్లు కళకళలాడాయి.సామాజిక కార్యకర్త గుజ్జుల గౌరీశ్వర నాయుడు కుటుంబం భోగి శుభాకాంక్షలు తెలిపారు.వారి నివాసంలో సంప్రదాయ భోగి మంటలు వేసి ఆకట్టుకునే రంగురంగుల భోగి ముగ్గులతో పండుగ వైభవాన్ని చాటారు.ఈ కార్యక్రమంలో లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిక్కిలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు,ఆరోగ్యం, శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.ఈ భోగి పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని కొత్త ఆశలను నింపాలని కోరుకుంటూ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు.

