NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓ అండ్ ఎమ్ విద్యుత్ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ

1 min read

క్యాలెండర్ ఆవిష్కరించిన  ఎమ్మెల్యే మాధవి రెడ్డి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి

కడప న్యూస్ నేడు:  నూతన సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కడప ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవిరెడ్డి దంపతులు బుధవారం ఓ అండ్ఎమ్ విద్యుత్ ఉద్యోగుల డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆమె భర్త రెడ్డప్ప శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగులు కొత్తగా ఓ అండ్ ఎం యూనియన్ ను స్థాపించి ఉద్యోగుల భవిష్యత్ కార్యాచరణ, ఉద్యోగుల వెల్ఫేర్ పండ్, ఉద్యోగుల భద్రత భవిష్యత్తుకై ఏర్పడినటువంటి ఈ యూనియన్  అన్ని యూనియన్లకు ఆదర్శం కావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే విద్యుత్ పనులు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, మీరు కష్టపడితే ప్రజలందరికీ వెలుగు ఉంటుందని అలాంటిది పనిచేసే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ ఉద్యోగులు మరింత భద్రతాభావంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ఓ అండ్ ఎంవిద్యుత్ ఉద్యోగులను ఈ సందర్భంగా అభినందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ దొరబాబు డిస్కమ్,సెక్రటరీ మురళి మోహన్ ,రీజినల్ ప్రెసిడెంట్ ప్రేమ్ చాంద్ ,రీజినల్ సెక్రటరీ చంద్ర ఓబుల్ రెడ్డి ,రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దస్తగిరి ,రీజినల్ ట్రెజరర్ ప్రవీణ్ కుమార్ ,డిస్కమ్ సెక్రటరీ హరి ప్రసాద్ బాబు, లాజర్, సందీప్, జగదీష్, ముని కుమార్ మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

About Author