సంత్ గాడ్గే బాబా జయంతి వేడుకలు
1 min read

హోళగుంద న్యూస్ నేడు: స్థానిక హోళగుంద మండలంలోని శివ ట్రేడర్స్ అంగడి ముందు సంత్ గాడ్గే బాబా చిత్ర పటానికి పులమలవేసి నివాళ్ళు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా మల్లికార్జున నాగరాజు శివ కళింగ కరెంట్ మల్లికార్జున మాట్లాడుతూ జయంతి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 23న ఘనంగా జరుగుతుంది.సంత్ గాడ్గే బాబా (డెబుజీ ఝింగ్రాజీ జానోర్కర్) 1876 ఫిబ్రవరి 23న మహారాష్ట్ర అమరావతి జిల్లా షెణగావ్ గ్రామంలో రజక కుటుంబంలో జన్మించారు.1956 డిసెంబర్ 20న విముక్తి పొందారు. సామాజిక సేవలుస్వచ్ఛతా ఉద్యమకర్తగా, సంఘ సంస్కర్తగా ప్రసిద్ధి. చీపురుతో వీధులు, కీర్తనలతో మనసులు శుభ్రం చేశారు. డా.అంబేద్కర్‌కు ‘గురూజీ’ అని పిలిచిన సామాజిక న్యాయ పోరాటోద్యమకారుడుజయంతి ఉత్సవాలురాష్ట్రవ్యాప్తంగా జరుపనున్నారు.ఈ కార్యక్రమంలో హనుమేష్.లింగప్ప రాజు.సున్నం వీరేష్.నగప్ప హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

