NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం

1 min read

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కేంద్రంలో నరేంద్ర మోడీ,రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధాలను, వస్తున్న సవాళ్లను  అధిగమిస్తూ పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, పార్టీ ఏలూరు జిల్లా ఇన్చార్జి అక్కినేని వనజ పేర్కొన్నారు. సోమవారం సిపిఐ ఏలూరు జిల్లా సమితి సమావేశం సిపిఐ  జిల్లా కార్యవర్గ సభ్యులు జే.వి. రమణ రాజు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అక్కినేని వనజ మాట్లాడుతూ నేడు అంతర్జాతీయంగా ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా ఒక దేశ సార్వభౌమత్యాన్ని దెబ్బ తీసే విధంగా వెనిజులా అధ్యక్షులు ముదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ లు అత్యంత పాశవికంగా అపహరించడం అంతర్జాతీయ హక్కులను హరించడమేనని విమర్శించారు. ముదురో దంపతులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ట్రంప్ వాణిజ్య ఒప్పందం పేరుతో ఇతర దేశాలకు ఉన్న స్వేచ్ఛా  వాణిజ్య హక్కులను హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశాల మధ్య ఉన్న వ్యాపార సంబంధాలపై అమెరికా తన వాణిజ్య ఒప్పందాల పేరుతో ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తుందని మండిపడ్డారు. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించి సిపిఐ శ్రేణులు పనిచేయాలన్నారు.అనంతరం సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య గత కార్యకలాపాల నివేదిక ప్రవేశపెట్టారు.తొలుత సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు ఇటీవల మరణించిన సిపిఐ,ఇతర ప్రజా సంఘాల నాయకులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఒక  నిమిషం మౌనం పాటించారు.ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య,  రాష్ట్ర సమితి సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్, మన్నవ యామిని,జిల్లా కార్యవర్గ సభ్యులు బాడిస రాము, తొర్లపాటి బాబు,నిమ్మగడ్డ నరసింహ,కొన్నే లక్ష్మయ్య,రామవరం సర్పంచ్ పిట్టా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author