హలో అనొద్దు.. వందేమాతరం అనండి !
1 min readపల్లెవెలుగువెబ్: సాధారణంగా ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అని పలకరిస్తుంటాం. దానికి బదులు వందేమాతరం అని పలకాలని ప్రజలకు మహారాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీనితోపాటు పలు అంశాలపై వినూత్నమైన ప్రచారాన్ని ఆ రాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ వివరాలను వెల్లడించారు. హలో అనే పదం పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, ఆ పదానికి ఒక అర్థమేమీ లేదని పేర్కొన్నారు. అదే వందేమాతరం అని పలకరించడం ద్వారా ఆప్యాయతా భావం పెంపొందుతుందని చెప్పారు.