NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

SBI .. స‌ర‌స్సులో తేలియాడే ఏటీఏం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మొబైల్ ఏటీఏం పేరు విన్నాం కానీ.. ఫ్లోటింగ్ ఏటీఏం ఏంట‌ని అనుకుంటున్నారా?. అవును ఎస్బీఐ నిజంగానే నీటిలో తేలియాడే ఏటీఏంను ఏర్పాటు చేసింది. శ్రీన‌గ‌ర్ లోని దాల్ స‌రస్సులో నీటిపై తేలియాడే ఏటీఏంను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. శ్రీన‌గ‌ర్ కు వ‌చ్చే ప‌ర్యాట‌కుల సౌక‌ర్యార్థం దీనిని ఏర్పాటు చేసినట్టు ఎస్బీఐ తెలిపింది. ఎప్పటి నుంచో ఉన్న ఇక్కడి ప్రజ‌ల కోరిక తీర్చామ‌ని, ఇది శ్రీన‌గ‌ర్ కు అద‌న‌పు ఆక‌ర్షణ‌గా నిలుస్తుంద‌ని ఎస్బీఐ ట్వీట్ లో పేర్కొంది. ఇండియాలో తొలి తేలియాడే ఏటీఏంను కొచ్చిలో 2004లో ఏర్పాటు చేశారు. ఇది కూడ ఎస్బీఐనే ఏర్పాటు చేసింది. కొచ్చిలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ ఏటీఏం ప్రపంచంలోనే మొద‌టిద‌ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అప్పట్లో తెలిపింది.

About Author