ఎస్బీఐ(ఎస్సీవో)606 ఉద్యోగాలు…నోటిఫికేషన్ విడుదల!
1 min readపల్లెవెలుగువెబ్ ఢిల్లీ: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీవో రిక్రూట్ కింద ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈమేరకు పలు పోస్టులను భర్తీ చేసేందుకు 20–40ఏళ్ల వయస్సులోపు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రాడ్యుయేట్, పీజీ, ఎంబీఎ తదితర విద్యార్హత కలిగి ఉండి కనీస అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎస్బీఐలోని ఆయా కేటగిరిలకు 606 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసుకునే చివరి తేదీ అక్టోబరు 18గా నిర్ణయించింది.
పోస్టుల వివరాలు: ఎగ్జీక్యూటివ్(డాక్యుమెంట్ ప్రిజర్వేషన్) పోస్టు 1, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు 314, రిలేషన్షిప్ మేనేజర్(టీమ్‌లీడ్) పోస్టులు 20, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 217, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ పోస్టులు 12, సెంట్రల్ రీసర్చ్టీమ్(ప్రొడక్ట్ లీడ్)పోస్టులు 2, సెంట్రల్ రీసెర్చ్ టీమ్(సపోర్ట్) పోస్టులు 2, మేనేజర్(మార్కెటింగ్)పోస్టులు 12, డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్)పోస్టులు 26 చొప్పున ఖాళీలు ఉన్నట్లుగా ఎస్బీఐ ప్రకటించింది.
దరఖాస్తుఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ కేటగిరి అభ్యర్థులు రూ.750 డెబిట్ కార్డ్, క్రెడిట్‌కార్డ్, ఇంటర్నెట్ బ్యాకింగ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరి అభ్యర్థులకు ఫీజు చెల్లింపు మినహాయించబడింది.
ఎంపిక విధానం: పోస్టుల ప్రకారం షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, ఆన్లైన్ పరీక్ష, ఇంటరాక్షన్ విధానంతో ఎంపిక జరుగుతుంది.
వెబ్సైట్: https://sbi.co.in/