NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి 

1 min read

– ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

– ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఈనెల 18వ తేదీ నుండి  22వ తేదీ వరకు జరిగే  పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ  వర్గీకరణ బిల్లు పెట్టాలని కోరుతూ  మంద కృష్ణ మాదిగ ఆదేశాల  మేరకు  నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం  కేంద్రంలో  ఎం ఎస్ పి, ఎమ్మార్పీఎస్, చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం  ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ నిరసన దీక్షలకు  నంద్యాల జిల్లా సీనియర్ నాయకులు   ప్రేమ రాజు,  ఎమ్మార్పీఎస్  నంద్యాల జిల్లా  వర్కింగ్ ప్రెసిడెంట్  కనకం నాగరాజు  వారి ఆధ్వర్యంలో  ఎమ్మెస్పీ  నంద్యాల జిల్లా కో కన్వీనర్  కోట ప్రభాకర్, ఎంఎస్పి సీనియర్  జిల్లా నాయకులు  కొండపోగు నాగరాజు  ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.  కేంద్రంలో  బిజెపి ప్రభుత్వం   అధికారంలోకివస్తే    వంద రోజుల్లో వర్గీకరణ చేస్తాము అని  చెప్పడం జరిగింది .కానీ  అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 సంవత్సరాల  జరిగిన కానీ  ఇంతవరకు  ఎస్సీ వర్గీకరణ బిల్లు   ప్రవేశపెట్టకుండా  నీరు గారు స్తున్నారన్నారు. బాధ్యతగల పదవిలో ఉండి  మాదిగలకు హామీ ఇచ్చి మాదిగల ఓట్లతో గెలిచి  మాదిగలను మోసం చేస్తున్నటువంటి బిజెపి  ప్రభుత్వం  ఇప్పుడు జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే  ఎస్సీ వర్గీకరణ  బిల్లును ప్రవేశపెట్టి  మాదిగలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని  తన యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మార్పీఎస్ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి  శీను మాదిగ  బుడగ జంగాల జిల్లా నాయకులు  జమ్మన్న,    ఎమ్మార్పీఎస్  పాములపాడు మండల కో కన్వీనర్ బోలెద్దూ మోహన్,  మాదిగ    మిడుతూరు మండల  ఎంఎస్పి కన్వీనర్  వెంకటరమణ, కొత్తపల్లి మండల ఎం ఎస్ పి  మండల అధ్యక్షుడు  కనక నాగన్న   ఎంఎస్పి తాలూకా నాయకులు  బోరెల్లి శేషన్న మాదిగ  ఎస్    వెంకటేశ్వర్లు మాదిగ  బొందెల వెంకటేశ్వర్లు  నందికొట్కూరు పట్టణ అధ్యక్షుడు విక్రం మాదిగ , ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి ఎం ఈ ఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

About Author