బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి…
1 min read
ఎంఈఓ 2 సునీత
చెన్నూరు, న్యూస్ నేడు : బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని అక్షరాస్యత వల్లే అజ్ఞానం తొలుగుతుందని, నేటి బాలలే రేపటి పౌరులని ఎంఈఓ-2 సునీత అన్నారు. మండలంలోని చిన్న మాచు పల్లె గ్రామంలో బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించే కార్యక్రమానికి ఎంఈఓ సునీత శ్రీకారం చుట్టడం జరిగింది. గురువారం ఆమె ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలో బడి పిల్లల కోసం సర్వే చేయడం జరిగినది. నూతన విద్యా వ్యవస్థ యొక్క విధానం గ్రామంలో ప్రతి తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉద్దేశాలను విధానాలను గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సుందర్ రామిరెడ్డి ,సి ఆర్ టి యం తంగెళ్ళ గురయ్య, గ్రామ పెద్దలు,భరత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.