సచివాలయం.. గ్రామాభివృద్ధికి ప్రామాణికం..
1 min read– రాయచోటిలో గ్రామ సచివాలయం,ఆర్బీకే, విలేజ్ క్లినిక్ నిర్మాణాలు పూర్తి కావడం అభినందనీయం
– ఎంపి మిథున్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ విజయ రామరాజు
పల్లెవెలుగు వెబ్, రాయచోటి: సచివాలయాలు.. గ్రామాభివృద్ధికి ప్రామాణికాలు అని, ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువగా పారదర్శకంగా పాలన అందుతోందని ఎంపి మిథున్ రెడ్డి,ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ విజయరామ రాజు అన్నారు. శుక్రవారం సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె గ్రామ సచివాలయం, వై ఎస్ ఆర్ రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ నూతన భవనాలను ఎం పి మిథున్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ విజయ రామరాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మిథున్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు నిధులకు శంకు స్థాపన చేశారని, ఇప్పుడు ఆ పనులు కార్యరూపం దాల్చాయన్నారు. అనంతరం కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ నారాయణరెడ్డి గారిపల్లె పంచాయతీ పరిధిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ మూడింటిని ఒకే ప్రాంగణంలో సర్వాంగసుందరంగా నిర్మింపచేయడం అభినందనీయ మన్నారు.జిల్లాలో రాయచోటి నియోజకవర్గంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చొరవతో సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుచుండడం అభినందనీయం, ఆదర్శనీయమన్నారు.
వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ…
నారాయణరెడ్డిగారిపల్లె సచివాలయ సముదాయ ఆవరణంలో దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ విగ్రహావిష్కరణను ఆవిష్కరించారు. అనంతరం నివాళులర్పించారు.
ప్రాణవాయువు ఉత్పత్తి కేంద్రం ప్రారంభం
రాయచోటి ఏరియా ఆసుపత్రిప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ప్రాణవాయువు ఉత్పత్తి కేంద్రాన్ని ఎంపి మిథున్ రెడ్డి , కలెక్టర్ విజయరామరాజులు ప్రారంభించారు. కరోనా విజృంభించినప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్న సంకల్పంతో జిల్లాలో ప్రథమంగా రాయఛోటిలో ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, రాయలసీమ విద్యా సంస్థల అధినేత ఆనంద రెడ్డి, వై ఎస్ ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి చిదంబర్ రెడ్డి, వై ఎస్ ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి వడ్డీ వెంకట రమణా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి, మాజీ జెడ్ పి టి సి ఉపేంద్రా రెడ్డి, మాజీ ఎం పి పి బరుగు రెడ్డేన్న, మండల కన్వీనర్ ఉదయ్ కుమార్ రెడ్డి తదితర ప్రముఖులకు డి సి సీబీ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, నారాయణరెడ్డి గారిపల్లె సర్పంచ్ అలివేలమ్మ, నాగరాజు యాదవ్, ఎం పి టి సి రఘు, వసంతు శ్రీనివాసులు రెడ్డి, శివశంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.