90 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలను పంపిణీ చేయాలి
1 min read
రైతు సంఘం డిమాండ్
పత్తికొండ, న్యూస్ నేడు : ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో సన్న, చిన్న కారు రైతులకు,కౌలు రైతులకు వేరుశనగ తోపాటు అన్ని పంటలకు శుద్ధి చేసిన విత్తనాలు 90 శాతం సబ్సిడీతో రైతులకు సరిపడేన్నీ తక్షణమే ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం (ఏ. ఐ. కె. ఎస్) కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి డి. రాజా సాహెబ్, పత్తికొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బి. సురేంద్ర కుమార్, కౌలు దారు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. తిమ్మయ్య లు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో సీపీఐ రైతు సంఘం ప్రతినిధులు బృందం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆర్. డి. ఓ. కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావస్తున్నా ప్రభుత్వం విత్తనాలు విషయంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాడం లేదని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. విత్తనాలు ధరలు రోజు,రోజుకు పెరిగిపోతున్నాయని తక్షణమే అరికట్టలన్నారు. కల్తీ, నాసిరకం విత్తనాలు ను మార్కెట్ లోకి రాకుండా నిరోదించాలని వారు కోరారు. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అక్రమాలకు, పాల్పడుతున్న విత్తనం కంపెనీల పై , డీలర్లు పై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. వ్యయసాయ పరికరాలు సన్న, చిన్న కారురైతులకు, కౌలు రైతులకు పూర్తిగా సబ్సిడీతో ఇవ్వాలన్నారు. ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల స్కెలప్ ఫైనాన్స్ పెంచి పంటరుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏలాంటి హామీ లేకుండా కౌలు రైతులకు రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి భూ యజమానులు ప్రమేయం లేకుండానే నేరుగా కౌలు రైతులకు గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. మేము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం క్రింద రూ: 20,000 /- లు ఇస్తామని సంవత్సరం గడిచిన పట్టించుకోకుండా రైతులను నిర్లక్ష్యం చేశారు.