PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా యంత్రాంగం నిర్దేశించిన రేట్లకే నాణ్యమైన బియ్యం అమ్మకాలు..

1 min read

– తాసిల్దార్ కృష్ణ జ్యోతి, సివిల్ సప్లై డిటి మల్లికా జరీనా సంయుక్తంగా ప్రారంభం..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :   చింతలపూడి పట్టణ,ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యాన్ని అందజేసే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందని తాసిల్దార్ కృష్ణ జ్యోతి  అన్నారు.సోమవారం స్థానిక గురుభట్ల గూడెం (జి బి జి) రోడ్డు శ్రీ లలిత సాయి మిత్ర ట్రేడర్స్ నందు జిల్లా యంత్రాంగం నిర్దేశించిన రేట్లకే  నాణ్యమైన బియ్యం అమ్మకానికి ఏర్పాటుచేసిన స్టోర్ ను చింతలపూడి తాసిల్దార్ కృష్ణ జ్యోతి, సివిల్ సప్లై డిటి మల్లికా జరిన సంయుక్తంగా ప్రారంభించారు.  ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో బియ్యం రేట్లను నియంత్రించేందుకు సివిల్ సప్లై అధికారులు, చాంబర్స్ ఆఫ్ కామర్స్, హోల్ సేల్ బియ్యం వ్యాపారస్థుల సమన్వయంతో ప్రభుత్వ స్టోర్ లలో బియ్యం అమ్మకాలను ప్రారంభించినట్లు తెలిపారు. నేడు చింతలపూడిలో  తొలి స్టోర్ ప్రారంభించడం జరిగిందన్నారు.  బహిరంగ మార్కెట్లో ధరకు ప్రభుత్వ స్టోర్ ధరకు పది రూపాయల వరకు వ్యత్యాసం ఉందన్నారు. బహిరంగ మార్కెట్లో సాధారణ రకం రూ.42/-, ఫైన్ రకం రూ.45/-, సూపర్ ఫైన్ రకం రూ.55/- ఉండగా, ప్రభుత్వ స్టోర్ లో వరుసగా రూ.34/-, రూ.40/-, రూ.46/- ధరలు నిర్ణయించి, అమ్మకాలు చేపట్టినట్టు తెలిపారు.  ఈ స్టోర్స్ లో కందిపప్పు కూడా విక్రయాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఇతర జిల్లాల నుండి కందిపప్పును దిగుమతి చేసుకుని ఈ స్టోర్స్ ద్వారా అమ్మడం జరుగుతుందన్నారు.  ఇటీవల టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో తక్కువ ధరలకు టమాటాలను అందించేందుకు  ఇతర జిల్లాల నుండి తెప్పించి రైతు బజార్ ల ద్వారా అమ్మకాలు చేపట్టడం జరిగిందన్నారు.  ప్రజలు  మార్కెట్ లో పెరిగిన ధరల కారణంగా ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో  సివిల్ సప్లైస్ , హార్టికల్చర్ ,  మార్కెటింగ్, సివిల్ సప్లై మార్కెటింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About Author