NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఆర్డబ్ల్యూఎస్ సర్కిల్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు..

1 min read

అన్ని మతాల సారాంశం ఒక్కటే ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి సేవ భావంతో  మెలగాలి..

ఎస్ ఈ ఎన్.వి.విసత్యనారాయణ

కేక్ కటింగ్ తో ఒకరినొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  స్థానిక అమీనా పేట జిల్లా పారిశుద్ధ్య మరియు నీటి సరఫరా సర్కిల్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు కార్యాలయ సిబ్బంది గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్ ఈ సత్యనారాయణ మాట్లాడుతూ క్రీస్తు అందించిన శాంతి సమాధానం మన పొరిగి వారికి కూడా అందించాలని, అందరితో శాంతి సమాధానంతో మెలగాలని అన్నారు. మన వృత్తె దైవంతో సమానమని, మనం చేసే పనిని నిబద్ధతతో నిజాయితీతో సక్రమంగా నిర్వహిస్తే అదే మనo క్రీస్తుకు అందించే నిజమైన జన్మదినo గా భావించాలన్నారు. అన్ని మతాల సారాంశం ఒకటేనని ఒకరినొకరు కలిసిమెలిసి జీవించి ఐక్యతతో సేవ భావం కలిగి ఉండాలన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన దైవజనులు గారపాటి ప్రభుపాల్ మాట్లాడుతూ క్రీస్తు ఈ లోకముకు సమాధానకర్తగా అవతరించారని శాంతి, ప్రేమ, ఓదార్పు, సమాధానము ఆయన ఈ లోకానికి అందించారన్నరు. కేక్ కటింగ్  తో ఒకరినొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాము సుధీర్ కుమార్ నేషనల్ హైవేస్ అథారిటీ ఇన్చార్జ్ , సిహెచ్ ఆర్ ఆర్ కె వర్మ ఆర్డబ్ల్యూఎస్ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్, ఆర్డబ్ల్యూఎస్ సర్కిల్ ఆఫీస్ మరియు సబ్ డివిజన్ల డీఈలు, ఏఈలు, కార్యాలయాల సిబ్బంది విచ్చేశారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటుచేసిన ప్రేమ విందులో పాల్గొన్నారు.

About Author