PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చైనా అధ్య‌క్షుడికి తీవ్రమైన వ్యాధి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీవ్రమైన మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు స‌మాచారం. సెరిబ్రల్ అన్యురిజం అనే వ్యాధితో ఆయన గత ఏడాది ఆసుపత్రిలో చేరవలసి వచ్చిందని, చైనా సంప్రదాయ వైద్య విధానంలోనే చికిత్స చేయించుకున్నారని ప‌లు వార్త‌లు గుప్పుమ‌న్నాయి. జాతీయ మీడియా కథనాల ప్ర‌కారం జీ జిన్‌పింగ్సెరిబ్రల్ అన్యురిజం వ్యాధికి చైనీస్ సంప్రదాయ చికిత్స పొందారు. శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ఇష్టపడలేదు. జిన్‌పింగ్ ఆరోగ్య పరిస్థితులపై చాలా కాలం నుంచి ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు విదేశీ నేతలతో జరిగే సమావేశాల్లో ఆయన పాల్గొనలేదు.

                                       

About Author