శిల్పా సేవ సమితి ద్వారా ప్రజలకు సేవ
1 min read– భగవంతుడు కల్పించిన భాగ్యంగా భావిస్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : రాజకీయాలకు కుల, మతాలకు అతీతంగా నంద్యాల ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో శిల్ప సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు సేవ చేయడం ఆ భగవంతుడు తమ కల్పించిన అవకాశంగా, భాగ్యంగా భావిస్తున్నామని, ఆత్మసంతృప్తి కలుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. శుక్రవారం శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ఆధ్వర్యంలో 136 మంది మహిళలకు 16 లక్షల 46వేల రూపాయల రుణాలకు సంబంధించి చెక్కులను బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి, ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపించడం జరిగింది. అలాగే గత 6నెలలుగా శిల్పా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను వారు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… శిల్పా కుటుంబం నంద్యాల ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించేందుకు శిల్పా సేవ సమితి స్థాపించి చేసి నేటి వరకు నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దీనికి ప్రధానంగా ప్రజల ఆశీర్వాదాలు, దేవుని దయ తమపై ఉందన్నారు. బ్యాంక్ పై వస్తున్న విమర్శకుల మాటలు తమను బాధించినా.. పేద ప్రజలకు తమ వంతు సాయం అందిస్తున్నామన్న సంతృప్తి సంతోషాన్ని కలిగిస్తుంది అన్నారు. రాజకీయాల్లోకి సంపాదన కోసం రాలేదని కేవలం సేవ చేయడానికి వచ్చామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రుణాలు పొందిన మహిళలు సకాలంలో రుణాలు తిరిగి చెల్లించి మరింత మందికి చేయూత అందించాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హలీల, మహిళలు పాల్గొన్నారు.