PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవలు అభినందనీయం..

1 min read

– డిప్యూటీ మేయర్ నూకపైయ్యి సుధీర్ బాబు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు సోషల్ సర్వీస్ సెంటర్ బిషప్ హౌస్ నందు అబ్రహం మాస్టారు. మేతర అజయ్ బాబు. తోట దావీదు రాజు ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించిన సందర్భంగా అభినందనల కార్యక్రమం క్రిస్టియన్ సంఘ పెద్దలు, డిప్యూటీ మేయర్, కోఆప్షన్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిఆర్డిఎపిడి విజయ రాజు.మెప్మా పీడీ ఇమ్మానుయేలు. రిటైర్ ఐఆర్ఎస్ చాగంటి సంజీవ్ .ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నూకపై సుధీర్ బాబు. నగరపాలక సంస్థ నెంబర్ మున్నుల జాన్ గుర్నాథ్ పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ సుధీర్ బాబు మాట్లాడుతూ సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు, ఎమ్మానయేలు మాట్లాడుతూ గత తరాలలో పేద బడుగు బలహీన వర్గాలకు విద్యా వైద్యం దూరంగా ఉండేదని అప్పుడు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పి అనేకమంది మానవతామూర్తులు సేవలు చేశారని ఇటువంటి సేవలు చేసిన సేవకులకు అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. చాగంటి సంజీవ్ మాట్లాడుతూ నిరంతరం పేద బడుగు బలహీన వర్గాలకు సేవలు చేస్తున్న గుర్తించి ప్రభుత్వం అవార్డులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ అవార్డు మనందరి అవార్డుగా భావించి అందరూ సేవలో పయనించాలని ఉన్నారు. సుధీర్ బాబు మాట్లాడుతూ సమాజంలో ఉన్న పేదవారికి అండగా ఉంటూ వారికి కావలసిన అవసరాలు తీర్చుతూ చేసే స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. జాన్ గురునాథ్ మాట్లాడుతూ సమాజంలో ఎన్నో రగ్మతలను పారద్రోలి వంద కన్నీటి బొట్టు తుడిచేలా సంస్థలు భరోసాని ఇచ్చి స్వచ్ఛంద సేవా సంస్థలె అన్నారు. అవార్డు పొందిన వారిలో ఆర్ విజయ రాజు డిఆర్డిఏ పిడి జిల్లాలో ఉన్న మహిళలు పింఛన్లు యువతకు నైపుణ్యత లో సేవలు చేసి నందుకు ఉత్తమ ఉన్నత అధికారిగా అవార్డు అందుకున్నారన్నారు, కల తోట హెన్రీ డోమిక్ జె అండ్ జె అరుణోదయ మానసిక విభిన్న ప్రతిభావంతుల విద్యాలయం స్థాపించి వారికి ఇంటింటికి వెళ్లి స్కూల్ కి తీసుకొచ్చి వారికి విద్య నడక మాట జియోతెరపి స్పీచ్ తెరపి వైద్యులతో వైద్యము ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తున్నారని అందుకుగాను అవార్డు అందుకున్నారన్నారు, నేతల రమేష్ బాబు వీరు బాల కార్మికుల విముక్తి కొరకు వారు హక్కుల కొరకు అనేకమైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి బాల విద్యార్థులకు చదువుపై వారి అభివృద్ధి కృషి చేస్తున్నoదుకుగాను అవార్డు అందుకున్నారన్నారు,తోట ఎడ్వైడ్ ఈయన ఆంటోనీ సంస్థ స్థాపించి గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు అలాగే పేద పేదలకు అనేక సేవలు చేస్తున్నారని వారు చేస్తున్న సేవలకు అవార్డు అందుకున్నారన్నారు,ఉప్పె రాజారావు ఈయన గత 30 సంవత్సరాల నుండి సమాజంలో ఉన్న పేదలకు వారి జీవనో అభివృద్ధికి సేవలు చేస్తూ విపత్తులోని అనేక సేవలు చేసినందుకుగాను అవార్డు అందుకున్నారన్నారు.

About Author