NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళల భద్రత, రక్షణకు  శక్తియాప్ ..జిల్లా ఎస్పీ

1 min read

ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి

కర్నూలు, న్యూస్​ నేడు: 2025 జనవరి నెల నుండి సెప్టెంబర్ 30  ఇప్పటివరకు జిల్లాలో  17,212 మంది శక్తి యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని ఆపద సమయాలలో మహిళలు, అమ్మాయిల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన శక్తి యాప్‌ గురించి విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్  శక్తి టీమ్ పోలీసులను ఆదేశించారు.ప్రతి మహిళ తమ ఫోనలో శక్తి యాప్‌ను డౌనలోడ్‌ చేసుకుని, పోలీసుల సాయం పొందేలా చైతన్యపరచాలని సూచించారు. ఏదైనా ప్రమాదం తలెత్తితే యాప్‌ ఓపెన్ చేసి ఎస్‌ఓఎస్‌ బటనను నొక్కితే బాధితులు ఉన్న లోకొషనను పోలీసులు గుర్తించి, తక్షణమే స్పందిస్తారని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా శక్తి యాప్ ద్వారా డయల్ 112,  శక్తి ఎస్ ఓ ఎస్ బటన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. మహిళలకు పోలీసులు అత్యవసర సహాయం అందించేందుకు శక్తి యాప్ పనిచేస్తుందన్నారు. శక్తి యాప్ 7993485111 నెంబర్ కు మహిళలు కాల్ చేసినా, మెసేజ్ చేసినా సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ కు సంకేతాలు వెళ్లిన వెంటనే శక్తి టీమ్ స్పం దించి ఆపదలో ఉన్న మహిళలను ఆదుకుంటారన్నారు. ఆపద సమయంలో శక్తి యాప్‌కు వచ్చే ఎస్‌ఓఎస్‌, డయల్‌ 112/100 కాల్స్‌తో సంఘటనా స్థలానికి ఈ టీమ్స్‌ వెళతాయన్నారు.

.

About Author