NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటికి వెళ్లి ప్రచారం చేసిన బిజెపి  నాయకులు

1 min read

చెన్నూరు , న్యూస్ నేడు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని వారి సంక్షేమం కొరకు అనేక పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందని ఈ పథకాల గురించి ప్రజలకు పెద్దగా తెలియడం లేదని ఆ సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్దేశంతోనే బిజెపి నాయకులు, కార్యకర్తలు మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో ఇంటి ఇంటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా  బిజెపి మండల అధ్యక్షులు పెడబల్లె వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో  కొండపేట గ్రామంలో మంగళవారం ఇంటింటికి వెళ్లి అక్కడి ప్రజలతో మమేకమై కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినట్టి నటువంటి వివిధ సంక్షేమ పథకాలను గురించి సంపూర్ణంగా వివరించడం జరిగిందని బిజెపి మండల అధ్యక్షులు పెడపల్లి వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ఆయుష్మాన్  భారత్, గ్రామ ఉజ్వల్  పథకం, మిషన్ కర్మయోగి, డిజిటల్ ఇండియా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన,స్వామిత్వ పథకం, ఇలా అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ప్రజలు ఈ పథకాలను తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని బిజెపి నాయకులు కార్యకర్తలు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాలలో ముందుకెళుతున్నదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ముకుంద రెడ్డి, టీ.ఏ. భరత్ రెడ్డి, శ్రీనివాసులు, మాధవి, ఓబులేష్ చంద్రమోహన్, లక్ష్మీ ప్రసన్న,మండల ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి, , గోవిందు గణేష్, చరణ్, రోహిత్, తదితరులు పాల్గొన్నారు.

About Author