అమ్మకానికి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ రంగంలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ కంపెనీకి చెందిన కీలకేతర ఆస్తులను ప్రత్యేక కంపెనీకి బదిలీ చేసి సెప్టెంబరు కల్లా ఎస్‌సీఐ అమ్మకం కోసం ఫైనాన్షియల్ బిడ్స్ ఆహ్వానిస్తామని అధికార వర్గాలు చెప్పాయి. ముంబైలో ఎస్‌సీఐ నిర్వహణలోని షిప్పింగ్ హౌస్, పోవైలోని నావికా శిక్షణా సంస్థలను ప్రత్యేక కంపెనీకి బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఈ కీలకేతర ఆస్తుల విలువ రూ.2,392 కోట్లుగా ఉన్నట్లు అంచనా. ఎస్‌సీఐ ఈక్విటీలో కేంద్ర ప్రభుత్వానికి 63.75 శాతం వాటా ఉంది.