NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ప్రారంభమైన శివరాత్రి మహోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంలో గురువారం ఉదయం నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి మహా శివరాత్రి ఉత్సవాలు సోమవారం ఉదయం విశేష పూజలతో మొదలయ్యాయి. ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ చేసిన అనంతరం ఉత్సవాల ఆరంభ సూచకంగా అర్చకస్వాములు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పుణ్యాహవాచనం, శివసంకల్పం, చండీశ్వర పూజ, ఋత్విగ్వరణం, అఖండ స్థపన, వాస్తు పూజ, వాస్తుహోమం, పంచావరణార్చన, మండపారాధన, రుద్ర కలశస్థాపన ఆలయ అర్చకులు ఘనంగా కార్యక్రమం నిర్వహించారు . సాయంత్రం 7.00 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేద పండితులు ఆలయ ఈవో లవన్న చైర్మన్ చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు సాయంత్రం 6.00గంటలకు శ్రీకాళహస్తీశ్వరస్వామివారి దేవస్థానం తరుపున శ్రీస్వామిఅమ్మ వార్లకు పట్టువస్త్రాల సమర్పణ ఉత్సవాలలో ప్రతిరోజూ స్వామిఅమ్మవార్లకు ఆయా వాహనసేవవలు నిర్వహిస్తారు.

About Author