శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా మారింది. ఇటీవల కరోన సోకడంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్టు వైద్యులు చెబుతున్నారు. శివశంకర్ మాస్టర్ భార్య, పెద్ద కుమారుడికి కూడ కరోన పాజిటివ్ గా తేలింది. ఆయన కుమారుడు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయన భార్య హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. చాలా చిత్రాలకు, చాలా భాషల్లో ఆయన కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. వివిధ పాత్రల్లో కూడ నటించారు.
ReplyForward |