వాహనదారులకు షాక్.. !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల పైబడిన పాత వాహనాల ఆర్సీ రెన్యువల్, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఇకపై, 15 ఏళ్లు పైబడిన కారు ఆర్సీ రెన్యువల్‌కు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుకు 8 రెట్లు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆర్సీ రెన్యువల్ ఆలస్యం చేసే వారిపై కూడా భారీ జరిమానాలతో కొరడా ఝుళిపించనుంది. ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్లో ఆలస్యం చేస్తే, నెలకు 300 నుంచి 500 రూపాయల జరిమానా వసూలు చేయనుంది. ఒకవేళ, వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ ఆలస్యం చేస్తే రోజువారీగా రూ.50 జరిమానా విధించనుంది.