PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బయోమెట్రిక్ ద్వారానే విక్రయించాలి..

1 min read

– నందికొట్కూరు సహాయ వ్యవసాయ సంచాలకులు విజయ శేఖర్
పల్లెవెలుగు, వెబ్​ నందికొట్కూరు : పట్టణంలో ఉన్న ఎరువుల, విత్తనాలు, పురుగు మందులు వ్యాపారులు నిబంధనల ప్రకారమే విక్రయించాలని, వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని నందికొట్కూరు సహాయ వ్యవసాయ సంచాలకులు విజయ శేఖర్ పేర్కొన్నారు. పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీ లక్ష్మీ ఫెర్టిలైజర్స్ గోడౌన్ వద్ద పట్టణంలోని వ్యాపారుల సమావేశానికి నందికొట్కూరు ఏ డి ఏ విజయ శేఖర్ , మండల వ్యవసాయ అధికారిణి శ్రావణి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. నూతన అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీశ్వర నాయుడు వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో వ్యాపారులు అందరితో ప్రతిజ్ఞ చేయించారు.అసోసియేషన్ అధ్యక్షులు గౌరీశ్వర నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించి వ్యాపారాలు చేసుకుందామని ప్రతి రైతు అధిక దిగుబడి సాధించేందుకు మన వంతు తోడ్పడదమన్నారు. ప్రభుత్వ, వ్యవసాయ శాఖ నిబంధనలు పాటిస్తూ అధికారుల సలహాలు సూచనలు మేరకు అందరూ కలిసికట్టుగా వ్యాపారాలు చేస్తామన్నారు.అనంతరం ఏ డి ఏ విజయ శేఖర్ , ఏ ఓ శ్రావణి లు మాట్లాడుతూ వ్యాపారులు ప్రతి దుకాణంలో రైతులకు నాణ్యమైన ఎరువులు విక్రయించాలని తెలిపారు. రైతులకు ఎరువులు విక్రయించేటప్పుడు బయోమెట్రిక్ ద్వారానే విక్రయించాలని సూచించారు. ప్రతి వ్యాపారి లైసెన్స్ లు కలిగి ఉండాలన్నారు. లైసెన్సులు పూర్తయిన వారు రెన్యూవల్ చేసుకోవాలని అన్నారు. వ్యాపారులకు ఏమైనా సమస్యలు వున్నప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తే పరిస్కారనికి కృషి చేస్తామన్నారు. వ్యాపారులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వ్యవసాయ శాఖ నిబంధనల ప్రకారం నడుచుకోవలన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులకు వచ్చే పంట తెగుళ్ళపై, వారు వేసుకున్న పంటలకు వచ్చే తెగుళ్ళు నివారణకు పిచికారీ చేసే మందులపై వ్యాపారులకు త్వరలో శిక్షణ ఇచ్చేందుకు పాటుపడతామన్నారు. నిబంధనల అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. నూతన అసోసియేషన్ వారికి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొని వస్తే ఉన్నతాధికారులకు తెలిపి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. . ఈ కార్యక్రమంలో ఎరువుల, పురుగు మందులు, విత్తనాల వ్యాపారులు రంగారెడ్డి, నంద కుమార్, లక్ష్మయ్య, వెంకట రెడ్డి, రవి, అచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author