అంగరంగ వైభవంగా శ్రీ వీరభద్ర స్వామి రథోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మండల పరిధిలోని కైరుప్పల గ్రామంలో వెలిసిన శ్రీ వీరభద్ర స్వామి కాళికాదేవి రథోత్సవం ఆదివారం సాయంత్రం అందరంగా వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ఆకు పూజ గంగపూజ పంచామృతాభిషేకం కుంకుమచ్చన పుష్పాభిషేకం మహా మంగళహారతి తదిత పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం 6 గంటలకు వీరభద్ర స్వామి కాళికాదేవి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి రథోత్సవం వరకు ఊరేగింపుగా వంచి రథోత్సవంలో కూర్చోబెట్టి బలిదానం రథానికి సమర్పించి రుద్ర హోమం నిర్వహించి జనసంద్రం రథోత్సవమును బసవన్న కట్ట వరకు లాగి తిరిగి యధా స్థానానికి చేరింది ఈ రథోత్సవ కార్యక్రమానికి కారుమంచి,కలపరి,పుప్పల దొడ్డి, యాటకల్లు, చుట్టుపక్కలతదితర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కానుకలు సమర్పించి ముడుపులు చెల్లించారు.రథోత్సవ వేడుకలలో ఎలాంటి సంఘటనలో జరగకుండా సీఐ సీఐ ఈశ్వరయ్య పోలీస్ బందోబస్తు నిర్వహించారు.వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రథోత్సవంలో సర్పంచ్ తిమ్మక్క, ఎంపీటీసీ లక్ష్మి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వీరభద్రి ,రంగన్న,లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.