వాల్మీకి,బోయల పై ఏకసభ్య కమీషన్
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలోని వైసీపీ ప్రభుత్వం బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వాల్మీకి, బోయ, బెంతు ఒరియాల సామాజిక స్థితిగతులపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ సామాజిక వర్గాల స్థితిగతులపై 3 నెలల్లోగా నివేదిక అందజేయాలని కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.