PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజ్ఞానపీఠంలో వైభవంగా సోదరి నివేదిత జయంతి

1 min read

పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూలు శివారు జి పుల్లారెడ్డి నగర్ లోని విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాలలో అక్టోబర్ 28వ తేదీ సోదరి నివేదిత జయంతి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తగా ప్రముఖ సామాజికవేత్త , వివేకానంద కేంద్ర కన్వీనర్ శ్రీసారంగం శివ ప్రసాదరావు గారు మాట్లాడుతూ ఐర్లాండ్ దేశానికి చెందిన సోదరి నివేదిత భారత స్వాతంత్రోద్యమ కాలంలో ఎన్నో రకాల సామాజిక సేవలు, స్త్రీల కొరకు ఎన్నో విద్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో తన పేరు మార్చుకొని, హిందూ ధర్మాన్ని స్వీకరించి,ఈ సంస్కృతిని విదేశాలలో ప్రచారం చేయడానికి కూడా ఆమె తోడ్పాటునందించిందని శివప్రసాద్ తెలిపారు. సభాధ్యక్షులు విజ్ఞాన పీఠం కార్యదర్శి శ్రీ గురుమూర్తిగారు మాట్లాడుతూ భారతమాతకు తన సర్వస్వం నైవేద్యంగా భావించి మార్గరెట్ నోబెల్ అనే తన పేరును సోదరి నివేదితగా మార్చుకున్నదని ,కేవలం తాను 44 సంవత్సరాలు జీవించినప్పటికి గొప్ప సేవలు చేసిందని కొనియాడారు .ఈ కార్యక్రమంలో విజ్ఞాన పీఠం కోశాధికారి శ్రీ మాణిక్య రెడ్డి గారు,ప్రధానోపాధ్యాయులు శ్రీ వ్యాసరాజ్ ,, శ్రీ చంద్రమోహన్ ,శ్రీ నాగేశ్వర రెడ్డి, శ్రీ సోమయ్య, శ్రీ శివారెడ్డి, శ్రీ రాజశేఖరరెడ్డి, శ్రీ మురళి, శ్రీ మతి మీనా తదితరులు ప్రసంగించారు.

About Author