NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెమెడెసివీర్ ఇంజ‌క్షన్లు అమ్ముతున్న ఆరుగురి అరెస్ట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: గ‌డువు తీరిన రెమెడెసివీర్ ఇంజెక్షన్లు అధిక ధ‌ర‌ల‌కు అమ్ముతున్న ఆరుగురిని ఎల్బీన‌గ‌ర్ పోలీసులు అరెస్టు చేశారు. గుర్రంగూడ‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి రోగిబంధువుకు ఒక్కో ఇంజెక్షన్ రూ.16,200కు విక్రయించాడు. అయితే.. ఇంజెక్షన్ మీద గ‌డువుతీరిన తేది ఉండ‌టంతో , రోగి బంధువు స‌ద‌రు అమ్మిన వ్యక్తికి తెలిపాడు. ఇంజ‌క్షన్ అమ్మిన శ్రీకాంత్ తాను మ‌రో వ్యక్తి వ‌ద్ద కొన్నట్టు తెలిపాడు. దీంతో రోగి బంధువు అబేద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ద‌ర్యాప్తు చేశారు. ఇంజ‌క్షన్ లు ప‌లువురు చేయి మారి.. రోగి బంధువుకు వ‌చ్చిన‌ట్టు తేల్చారు. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వ‌ద్ద నుంచి ఇంజక్షన్లు, 5.5 ల‌క్షల న‌గ‌దు, 6 సెల్ ఫోన్ లు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నారు.

About Author