ఆరుగురి ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
1 min readపల్లెవెలుగు వెబ్, కడప: జిల్లాలోని అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు భారీగా ఎర్రచందనం తరలించుకుపోతున్నారు. ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ నేతృత్వంలో అటవీ ప్రాంతంతోపాటు సరిహద్దుల్లోనూ గట్టి నిఘా ఉంచారు. శుక్రవారం కాశీనాయన మండలంలోని సావిశెట్టి పల్లి గ్రామానికి తూర్పు వైపు సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న తెలుగుగంగ కాలువ వద్ద ఎర్రచందనంను అక్రమంగా తరలించుకుపోతున్న ఆరుగురి స్మగ్లర్లను బి. కోడూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 20 ఎర్రచందనం దుంగలు, ఒక స్కార్పియో కారు, 2 గొడ్డళ్లు, 4 పట్టుడు రాళ్లు స్వాధీనం చేసుకున్నారు. పరారైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలో పట్టుకుంటామని అడిషనల్ ఎస్పీ దేవ ప్రసాద్ వెల్లడించారు. మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్, పోరుమామిళ్ల సి.ఐ మోహన్ రెడ్డి, బి.కోడూరు ఎస్సై వెంకటరమణ, సిబ్బంది స్మగ్లర్లను పట్టుకున్నారు.