రవీంద్రలో గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక వెంకాయపల్లి నందు ఉన్న రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మెరుగైన ఉపాధి కోసం నైపుణ్యాభివృద్ధి ద్వారా గ్రామీణ మహిళలను సాధికార పరిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని బ్రిటిష్ కౌన్సిల్, యుకే లోని టీసైడ్ విశ్వవిద్యాలయం మరియు ఆర్ఎంజెఐటి సొల్యూషన్స్ నేతృత్వంలో జరగనుంది.నందనపల్లి, వెంకాయపల్లి మరియు పసుపల గ్రామీణ మహిళలు 100 కు పైగా ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం మహిళలకు సాఫ్ట్ స్కిల్స్, పరిశ్రమల సంబంధిత నైపుణ్యాలు మరియు ఆచరణాత్మక అనుభవం లాంటి నైపుణ్యాలను నేర్పించడం జరుగుతుంది. తద్వారా మహిళలు పరిశ్రమలలో ఉద్యోగాలు సులువుగా సంపాదించుకోగలరు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.కె. ఈ. శ్రీనివాసమూర్తి విచ్చేశారు, ఈ కార్యక్రమం ఆర్ఎంజెఐటి సొల్యూషన్స్ నేతృత్వంలో మహిళలకు తర్ఫీదునిస్తున్నందుకు అందులో భాగమైనందుకు తనకెంతో గర్వంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమం వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జె.ఉషారాణి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో ఆర్ఎంజెఐటి సొల్యూషన్స్ మేనేజర్/ ట్రైనర్ హూపేస్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
