చిరు ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్సు
1 min read– చిన్న పిల్లల్లో ఫాస్ట్ ఫుడ్,జింక్ ఫుడ్ లకు దూరంగా చిరు ధాన్యాలను అందించండి…ఎమ్మెల్యే కాటసాని
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో కృషి విజ్ఞాన కేంద్రం మరియు సత్వ మిల్లెట్స్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ జీ ధనలక్ష్మి అధ్యక్షతన చిరుధాన్యాల వినియోగంపై అవగాహన సదస్సును స్థానిక జి యం ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బనగానపల్లె శాసనసభ్యులు కాటసాని రామి రెడ్డి మరియు పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలీ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో వచ్చే వ్యాధులకు మన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని వాటి నుంచి బయటపడేందుకు చిరుధాన్యాల వినియోగమే ప్రత్యామ్నాయ మార్గమని అందుకే ప్రతి ఒక్కరూ వారి ఆహారంలో చిరుధాన్యాలను తప్పక వినియోగించాలని తెలియజేశారు.ఈ సందర్భంగా పద్మశ్రీ ఖాదర్ వలీ మాట్లాడుతూ వివిధ రకాల చిరుధాన్యాలైన కొర్రలు, అండు కొర్రలు, సామలు, వరి గలు, ఊదలు, అరికలు గురించి వాటి ఆహారపదార్థాల తయారీ, వాటి ఉపయోగా లను తెలియచేసారు. అలాగే చిరుధాన్యాలను క్రమం తప్పకుండా ఆహారంగా వినియోగించడం వల్ల దీర్ఘకాలిక రుగ్మతలైన డయాబెటిస్, బి పి, గ్యాస్ ట్రబుల్, మరియు హృదయ సంబంధిత రోగాలను నయం చేసుకోవచ్చునని తెలియచేసారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుడటమే కాకుండా వైద్యానికి అయ్యే ఖర్చులను పూర్తిగాతగ్గించవచ్చునని తెలిపారు. అలాగే చిన్నపిల్లలకు ఫాస్ట్ ఫుడ్స్/జంక్ ఫుడ్స్ అలవాటుకు దూరంగా పెంచి చిరుదాన్యాలతో తయారైనా ఆహారఉత్పత్తులను అందించడం ద్వారా ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించవచ్చునని తెలిపారు.సత్వ మిల్లెట్స్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఫౌండర్ కె. వి రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చిరుధాన్యల లాభాలను తెలియచేసారు, వారి విలువదారిత ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి కె లక్ష్మి ప్రియ గారు సమన్వయముచేయడంజరిగినది.ఈకార్యక్రమంలొ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ టి మోహన్ రావు గారు, SHE &CE అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్ కుమార్, కెవికె శాస్త్రవేత్తలు సుధాకర్, బాలరాజు, ఆదినారాయణ, రవి గౌడ్ అలాగే విద్యార్థులు, ఐసిడిఎస్ సిబ్బంది, వెలుగు మహిళా సిబ్బంది, సత్వ మిల్లెట్ సిబ్బంది, రైతులు మరియు రైతు మహిళలు తదితరులు పాల్గొన్నారు.