బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం నిషేధం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం కొడుమూరు కో లోకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని వర్కూరు గ్రామంలో జరుగుతున్న సంచార చికిత్స కార్యక్రమాన్ని జిల్లా సంచార చికిత్స కార్యక్రమ అధికారి డాక్టర్,రఘు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. డాక్టర్ రఘు ధూమపాన రహిత దినోత్సవం సందర్భంగా ప్రజలకు ధూమపానం చేయడం వలన కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి సంవత్సరం మార్చి నెల రెండవ బుధవారం జాతీయ ధూమపాన నిషేధ దినం నిర్వహిస్తామని, పొగ త్రాగడం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారి తీయవచ్చు,ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని దీంతోపాటు జీర్ణశయ క్యాన్సర్ ,క్షయలాంటి వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుంది,కడుపులో అల్సర్లు ,రక్త సరఫరా దెబ్బతిని కాళ్ళకు,చేతులకు పుండ్లు వచ్చే అవకాశం ఉంది, పొగతో ఊపిరితిత్తుల క్యాన్సర్,నోటి క్యాన్సర్, అన్నవాహిక,మూత్ర పిండాల సమస్యలు,అధిక రక్తపోటు,గుండెపోటు వచ్చే ప్రమాదము, క్షయ సంక్రమించవచ్చును,పొగ త్రాగే వారి కంటే పీల్చేవారే అధికంగా వ్యాధుల బారిన పడుతున్నారని ,దూమపానం ప్రభావం చిన్నారులపై ఎక్కువ ఉంటుంది అని తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగదాన్ని నిషేదిస్తూ 2003 లో చట్టం తెచ్చారని,ఈ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగితే 200 రూపాయలు జరిమానా విధిస్తారని,18 సంవత్సరములలోపు పిల్లలు పోగాత్రాగడం చట్ట విరుద్ధమని తెలిపారు.పాఠశాల పరిధిలో 100 యాడ్స్ లోపు పొగాకు ఉత్పత్తులు విక్రయించకూడదు.ధూమపానం మానలేకపోతున్నవారికి కర్నూలు సర్వజన ఆసుపత్రిలో డీ-అడిక్షన్ కేంద్రంలో అవసరమైనవారికి కౌన్సెలింగ్,చికిత్స అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమములో కో లోకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్. మదన్ శేఖర్ , ఆరోగ్య విస్తరణ అధికారి నరసప్ప, హెల్త్ సూపర్వైజర్ కమాల్ సాహెబ్ సామాజిక ఆరోగ్య అధికారి ధరణి ,ఆరోగ్య కార్యకర్త రమాదేవి,ఆశా కార్యకర్తలు మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.