NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

1 min read

పల్లెవెలుగువెబ్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణలో టికెట్‌ రేట్లు పెంచడం, ఆంధ్రాలో రేట్లు తగ్గించడం పట్ల చాలామంది కోర్టును ఆశ్రయించారు. రేట్లు పెంచడం మంచిదా? తగ్గించడం మంచిదా అన్నది చాలా పెద్ద విషయం. సమస్య ఎదురైనప్పుడు ఇండస్ట్రీ అంతా ఒకే తాటిపైకి వచ్చి గళం విప్పాలి. సినీ పరిశ్రమ ఏ ఒక్కరిదీ కాదు. అందరిదీ! టికెట్‌ రేట్ల గురించి ప్రభుత్వంతో చర్చించడానికి ఫిల్మ్‌ ఛాంబర్‌, నిర్మాతల మండలి ఉంది. వారు ఎలా సూచిస్తే మేం అలా నడుస్తాం. ‘మా’ అధ్యక్షుడిగా నేను వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడకూడదు. ఇటీవల చిరంజీవిగారు జగన్‌ని కలిశారు. అది వ్యక్తిగత సమావేశం. దానిని అసోసియేషన్‌ మీటింగ్‌గా భావించకూడదు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వాలతో ఛాంబర్‌ చర్చలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తోంది. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలని కోరితే మేం కూడా ఆయా ప్రభుత్వాలను కలిసి చర్చిస్తాం“ అని అన్నారు.

        

About Author