ఉపాధి హామీ పనుల సోషల్ ఆడిట్..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : 2021 22 కు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు గాను శనివారం నాడు మండలంలోని ఉపాధి హామీ కార్యాలయంలో ఎంపీడీవో సమావేశ మందిరంలో సోషల్ ఆడిట్ బృందాలు పనుల పురోగతి వాటి బిల్లులను పరిశీలించారు గ్రామసభ నిర్వహించడానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడంతో నిర్వహించడం లేదని రేపటి నుంచి ఏపీవో వెంకటరమణ ఆధ్వర్యంలో గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల కింద పంచాయతీరాజ్ పనులు ఆర్డబ్ల్యుఎస్ పనులను బిల్లులను పరిశీలించడం జరుగుతుందన్నారు సోషల్ ఆడిట్ కోఆర్డినేషన్ కార్యక్రమంలో ఎంపీడీవో విజయసింహారెడ్డి.. పంచాయత్ రాజ్ ఏఈ భాస్కర్. డిస్ట్రిక్ట్ రిసోర్ పర్సన్ .. ఈసీ సునీల్ గవాస్కర్ టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.