సమాజ సేవకులు.. ఎన్టీఆర్ అభిమానులు
1 min read
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు
ప్యాపిలి, న్యూస్ నేడు: డోన్ పట్టణానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షులు కలచట్ల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు సీసంగుంతల రంగారెడ్డి, కార్యదర్శి విజయ్ కుమార్ నాయుడు లు మిత్ర సంస్థ స్ఫూర్తి నిర్వాహణలో డోన్ పట్టణ, గ్రామీణ ఎన్టీఆర్ అభిమానుల మధ్యన భారీ కేక్ కట్ చేసి రైల్వే స్టేషన్ నందు అభాగ్యులకు అల్పాహార పంపిణీ, డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు, బాలింతలకు, రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు. అనంతరం శ్రీ కాశీనాయన సేవాశ్రమం మరియు పద్మావతి వృద్దాశ్రమాల్లో అన్నదానం చేపట్టి వృద్ధుల ఆకలి తీర్చారు. అదేవిధంగా ధర్మారం గ్రామానికి చెందిన మధు మహేంద్ర మిత్ర బృందం సభ్యులు స్ఫూర్తి ఆధ్వర్యంలో డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం చేసి వందలాది మంది పల్లె ప్రజల ఆకలి తీర్చారు. ఒక సినిమా హీరోకి ఇంత అభిమానులు ఉండటం, వారందరు అతని పేరు మీద ఇలా సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం అని పట్టణ ప్రజలు డోన్ ఎన్టీఆర్ అభిమానులను అభినదించారు. ఈ కార్యమాల్లో ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులు అంజి, టోనీ, యోగి, గౌస్, వెంకట్, రామచంద్ర, బాలు, మహమ్మద్, సురేష్ బాబు, సంతోష్, స్ఫూర్తి సభ్యులు స్ఫూర్తి మధు, భాస్కర్, శివయ్య, మౌలి, ధర్మారం ఎన్టీఆర్ అభిమానులు మహేష్, రవి, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
