సోనూసూద్ 20 కోట్ల పన్ను ఎగవేశారు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ 20 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఐటీ శాఖ వెల్లడించింది. మూడు రోజులుగా సోనూసూద్ కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహించింది. ఆయన ఆర్థిక లావాదేవీలను ఐటీ శాఖ పరిశీలించింది. ఈ క్రమంలో ఐటీ విభాగం నుంచి ప్రకటన వెలువడింది. సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు తెలిపారు. దాని కింద క్రౌడ్ ఫండింగ్ ద్వార 2.1 కోట్లు విదేశీ దాతల నుంచి సేకరించినట్టు తెలిపారు.