వరల్డ్ హియరింగ్ డేపై ప్రత్యేకంగా అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: వరల్డ్ హియరింగ్ డే (World Hearing Day – 2026 ) Theme – From communities to classrooms: hearing care for all children సందర్భంగా అవగాహన కార్యక్రమం – మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలువరల్డ్ హియరింగ్ డేని పురస్కరించుకుని Medicover Hospitals Kurnool లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరపు వరల్డ్ హియరింగ్ డే థీమ్‌కు అనుగుణంగా “ప్రతి ఒక్కరికీ వినికిడి ఆరోగ్యం – సకాలంలో పరీక్షలు, సరైన సంరక్షణ” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. చెవి వినికిడి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్యులు తమ అనుభవాలను పంచుకుని, పేషెంట్స్‌తో ప్రత్యక్షంగా చర్చలు జరిపారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు యూనిట్ హెడ్ Dr Maheswar Reddy మాట్లాడుతూ, “చిన్నారుల వినికిడి సామర్థ్యం ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. వరల్డ్ హియరింగ్ డే థీమ్ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ వినికిడి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. సకాలంలో గుర్తింపు మరియు చికిత్స ద్వారా శాశ్వత సమస్యలను నివారించవచ్చు. మా వైద్య బృందం ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై జ్ఞానాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది” అని తెలిపారు.మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు ప్రజల ఆరోగ్య సంరక్షణలో ప్రతి విభాగానికీ విశేష ప్రాధాన్యం ఇస్తూ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోంది.

