NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దివ్యాంగుల హక్కులు, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

1 min read

అన్ని ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగులకు కల్పించాల్సిన సౌకర్యాలను అమలు చేయాలి

జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఏడాదికి రెండుసార్లు సమావేశాలు నిర్వహించాలి: జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కర్నూలు, న్యూస్​ నేడు : దివ్యాంగుల హక్కులు, సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు, సౌకర్యాలను జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల హిజ్రాలు మరియు వయోవృద్ధుల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల హక్కులు, సంక్షేమం, చట్టపరమైన నిబంధనలపై అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ…దివ్యాంగుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ కోసం అధికారులతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, సంవత్సరానికి కనీసం రెండుసార్లు సమావేశాలు నిర్వహించాలని సూచించారు.ప్రతి శాఖలో దివ్యాంగులకు కల్పించాల్సిన సౌకర్యాలు, హక్కులు, ప్రభుత్వ నిబంధనలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. దివ్యాంగులకు సంబంధించిన అంశాలపై అన్ని శాఖలకు అధికారికంగా లేఖలు పంపించి, నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకునేలా చర్యలు జాయింట్ కలెక్టర్  తెలిపారు.అంతకుముందు దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు RPwD Act–2016పై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని హైదరాబాద్ యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్ అన్నవరం పి పి టి ద్వారా సూచించారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రాయిస్ ఫాతిమా, డిఎంహెచ్వో డాక్టర్ కామేశ్వర ప్రసాద్, డిసిహెచ్ జఫ్రుల, సిపిఓ భారతి, ఎస్సీ వెల్ఫేర్ రాధిక, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్ దివ్యాంగుల అసోసియేషన్ ఎల్లప్పు, అసోసియేషన్ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *